Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే? అది కూడా రాత్రుళ్లే!
ఇటీవల కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) కేసులు పెరుగుతున్నాయి. వయసు పైబడిన వారికే కాకుండా చిన్న వయసు వారికి కూడా స్ట్రోక్ రిస్క్ ఉంటోంది.
బ్రెయిన్ స్ట్రోక్స్ రెండు రకాలు. మెదడులోని రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం వల్ల వచ్చేదాన్ని ఇస్కీమిక్ (Ischemic) స్ట్రోక్ అంటారు. మెదడు నాళాలు చిట్లి రక్త స్రావమయ్యే దానిని హేమరేజిక్ (Hemorrhagic) అంటారు. ఇవే ఎక్కువమందిలో వస్తుంటాయి.చాలా మంది తాము తీవ్రమైన కాంతిని చూశామని, మరికొందరు తమ శరీరం తమది కాదన్న అనుభూతి కలిగిందని, పైనుంచి ఏవో దృశ్యాలను గమనిస్తున్నట్లు అనిపించిందని తెలిపారు.
అయితే నిద్రపోతున్నప్పుడు కూడా స్ట్రోక్ (Brain attack) వచ్చే అవకాశముంది. రాత్రి 10 గంటల తర్వాత స్ట్రోక్‌లు పెరుగుతున్నాయి. ఈ సమయంలో స్ట్రోక్ లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఐదు స్ట్రోక్ సింప్టమ్స్ బయటపడతాయి. అవేంటో చూద్దాం.
ఒక చేయి లేదా కాలు ఎత్తడంలో ఇబ్బంది పడటం, ముఖం ఒక వైపు సాగిలపడటం వంటివి స్ట్రోక్ రావడానికి ముందు కనిపించే లక్షణాలు. ఈ సమయంలో ఒకవైపు చేతిని పైకి లేపడం సాధ్యం కాదు. మెదడుకు రక్తం సరిగ్గా అందకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.
అయితే ఈ ముప్పు ఉన్న ప్రజలు FAST అనే రూల్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఆ రూల్ ప్రకారం, మూతి (Face) భాగం ఓ వైపు లాగినట్టు (ఫేషియల్ డీవియేషన్) అయినా, ఒక చేతిని (Arm) ఎత్తలేకపోయినా, మాటలు (Speech) తడబడినా, ఆ సమయం (Time)లోనే అంబులెన్స్‌కు ఫోన్ చేయాలి.
సడన్‌గా కళ్లు మబ్బుమబ్బుగా కనిపించడం, ఒకే వస్తువు రెండుగా కనిపించడం లేదా ఒక కన్ను లేదా రెండు కళ్లూ కనిపించకపోవడం స్ట్రోక్ లక్షణాలు. రాత్రి వేళ మసకబారిన వెలుతురులో ఈ లక్షణాలు గమనించడం కష్టం కావచ్చు. అందుకే ఇలాంటి అయిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి.
అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోవడం లేదా నడవడంలో ఇబ్బంది పడటం స్ట్రోక్‌కి మరో ముఖ్యమైన లక్షణం. నడవటం మొదలు పెట్టగానే తడబడుతున్నట్లు లేదా తల తిరుగుతున్నట్లు అనిపిస్తే అది స్ట్రోక్‌కు సంకేతం కావచ్చు. ముఖ్యంగా రాత్రి వేళ మసకబారిన వెలుతురులో ఈ లక్షణాలు గమనించడం కష్టం కావచ్చు.
మాటలు తడబడటం, పదాలు మర్చిపోవడం, వాక్యాలను సరిగ్గా ఫ్రేమ్ చేయలేకపోవడం, అర్థం లేని మాటలు మాట్లాడటం వంటివి కూడా స్ట్రోక్ సింప్టమ్స్ అని చెప్పవచ్చు. సింపుల్ క్వశ్చన్లకు సమాధానం చెప్పలేకపోవడం, ఒకే మాటను మళ్లీ మళ్లీ చెప్పడం చేస్తున్నా ఆందోళన పడాల్సిన అవసరం ఉంది. ఇది మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టిందని తెలిపే మరొక ముఖ్యమైన లక్షణం.
బ్రెయిన్ అటాక్ వచ్చే రిస్క్ వారికి నైట్ టైమ్‌లో కారణం తెలియకుండా అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావచ్చు. దీనివల్ల నిద్ర లేచే అవకాశం ఉంది. దీంతోపాటు మిగతా సింటమ్స్ కూడా కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
స్ట్రోక్ రాకుండా ఉండాలంటే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేయడం, శారీరకంగా చురుగ్గా ఉండటం అవసరం. స్ట్రోక్ రావడానికి ఒక ప్రధాన కారణం స్మోకింగ్. ఈ అలవాటు వెంటనే మానేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా వంటివి చేయాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినాలి.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.
Thanks for reading
Brain Stroke: These are the symptoms seen before a brain stroke? It's nights too!